శృంగవరపుకోట ఎల్లో సింగం ప్రతినిధి జనవరి 10
శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం చింతలపాలెం పంచాయతీ చింతలపాలెం గ్రామంలో పంచాయతీ సాధారణ నిధులు 5 లక్షల రూపాయలు వెచ్చించి నూతనంగా నిర్మించిన వరహా లక్ష్మీ నరసింహస్వామి భవనాన్ని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శనివారం ఉదయం ప్రారంభించారు ముందుగా గ్రామ పెద్దల సమక్షంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి ప్రత్యేక గరిడి నృత్యాలతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భవనాన్ని ప్రారంభించారు
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి కోసం అవసరమైన అన్ని సదుపాయాలు చేకూర్చడానికి తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, భక్తి భావంతో కూడిన ఇటువంటి సాముదాయిక కార్యక్రమాలు సామాజిక ఐక్యతను బలపరుస్తాయని వ్యాఖ్యానించారు. గ్రామ అభివృద్ధికి అహిర్నశలు శ్రమిస్తున్న యువకుడైన సర్పంచ్ నవీన్ కు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పలరాం ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు శ్రీ కోళ్ల వెంకటరమణ (శ్రీను), డోకుల అచ్చెం నాయుడు,ఉపాధ్యక్షులు యల్లపు సూరిబాబు,ప్రధాన కార్యదర్శి కనకాల శివ,బొబ్బిలి అప్పారావు మాస్టర్,పీఏసీఎస్ డైరెక్టర్ గొంప పోతు నాయుడు, గొంప దుర్గా ఉమేష్,బంగారు రమేష్,లెంక శ్రీను,మాజీ సర్పంచ్ పిల్లా అప్పలరాజు,పంచకర్ల శ్రీను,విరోతు శివాజీ,జామి సూరిబాబు, మాజీ ఎంపీటీసీ కాశీ,జనసేన మండల పార్టీ అధ్యక్షులు గొరపల్లి రవి గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు…*
