చందర్లపాడులో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవనానికి శంకుస్థాపన.

రూ.62 లక్షలతో నిర్మాణం – ప్రజలకు మరింత చేరువయ్యే ఆరోగ్య సేవలు : ఎమ్మెల్యే తంగిరాల

చందర్లపాడు ఎల్లో సింగం రిపోర్టార్

మండలంలో చందర్లపాడు టౌన్ నందు రూ.62 లక్షల వ్యయంతో నిర్మాణం చేయనున్న బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ (BPHU) భవన నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన భూమి పూజ మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధికారులు కూటమి నేతలతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు నాణ్యమైన, సమర్థవంతమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. బ్లాక్ స్థాయిలో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఈ BPHU కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ (BPHU) అనేది ల్యాబ్ స్థాయిలో ప్రజారోగ్య కార్యక్రమాల సమన్వయం, వ్యాధుల నివారణ, ఆరోగ్య పర్యవేక్షణ, డేటా విశ్లేషణ, అత్యవసర ఆరోగ్య స్పందన వంటి సేవలను అందించే ముఖ్యమైన కేంద్రం. ఈ యూనిట్ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాల పనితీరును మెరుగుపరచి, ప్రజలకు వేగవంతమైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో లాల్ బహుదూర్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు,సంబంధిత శాఖల అధికారులు, కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు మరియు స్థానికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చందర్లపాడు ప్రాంత ప్రజలకు ఈ BPHU భవనం నిర్మాణం ద్వారా ఆరోగ్య రంగంలో మరింత భద్రత, నాణ్యత లభిస్తుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

WhatsApp Join Now
Youtube Subscribe