ఎల్లో సింగం న్యూస్ హోళగుంద జనవరి 18
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,తెలుగువారి ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు 30 వ వర్ధంతిని మండల కేంద్రమైన హోళగుంద లోని బాలాజీ పెట్రోల్ బంక్ ఆవరణంలో టీడీపీ మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య,మాజీ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి చిన్నహ్యట శేషగిరి,మండల కార్యనిర్వాహక కార్యదర్శి మురళి,సీనియర్ నాయకులు ఎరిస్వామి,లక్ష్మన్న, కురువ మల్లి,టిడిపి గ్రామ అధ్యక్షుడు అయ్యప్ప,వైకుంఠం యూత్ ల్యాబ్ గిరి,ఐటిడిపి హనుమంతు,బూత్ కన్వీనర్లు తాహెర్,అమాన్,నాగేంద్ర, భాస్కర్,రామంజి,రంగప్ప, మంగన, మల్లి,రారావి సిద్దు తదితరులు స్వర్గీయ నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆదివారం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ
తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహా నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు.రూ.2 లకే కిలో బియ్యం,జనతా వస్త్రాల పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలతో బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ప్రదాతగా నిలిచారని కొనియాడారు.ఆలూరు టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి సారథ్యంలోఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం ప్రతి టీడీపీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గం పార్టీ జెండా ఎగిరే రోజులు దగ్గరలో ఉన్నాయని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
