గ్రామాల సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం : ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

నందివాడ, జనవరి 10 :

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు మరింత చెరువ చేసేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా విలేజ్ హెల్త్ క్లినిక్ లు నిర్మిస్తున్నట్లు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. ఒక్క నందివాడ మండలం పరిధిలోనే రూ.1.80 కోట్ల నిధులతో ఐదు క్లినిక్ లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. నందివాడ మండలం జొన్నపాడు గ్రామంలో రూ.36 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులకు కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భూమి పూజ నిర్వహించి శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ…, మండలంలో ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో ఐదు హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే మూడు క్లినిక్ ల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయని త్వరలో మిగిలిన రెండు క్లినిక్ ల నిర్మాణ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. గ్రామాల్లో ఈ క్లినిక్ ల ఏర్పాటు ద్వారా ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ అవుతాయన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి మంచి కార్యక్రమాలకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, సహకరించడం శుభపరిణామం అన్న ఎమ్మెల్యే రాము, స్థలదాతలకు ధన్యవాదాలు చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నందివాడ మండలంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.గ్రామాల సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే రాము ఉద్ధాటించారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, మండల టిడిపి అధ్యక్షులు దానేటి సన్యాసిరావు, టిడిపి నాయకులు చేకూరు జగన్మోహన్రావు, సింగరాల రాధాకృష్ణ, చిదరబోయిన సీతయ్య, యేసుపాధం, సాల్మన్ రాజ్, కమలయ్య, మురళి, సింగవరపు ప్రభాకర్, దారం శ్రీను, రాజేష్, గ్రామ నాయకులు రూంజుల రవిబాబు, పల్లారెడ్డి అంజిరెడ్డి పల్లారెడ్డి బాబి, ఈద సతీష,గుడపాటి వెంకటేశ్వరరావు, కొండపల్లి రాఘవరెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఉప్పు నాగేశ్వరరావు,దానే మురళి, భరతవాజ్, దేశ్మాల శేఖర్, రోజా, గుడపాటి నరేష్, వంగ ఏబు, సాల్మన్, బోనం వెంకటేశ్వరరావు, రాంప్రసాద్, ఈడుపుగంటి విజయకుమార్, బొడ్డు సుబ్బయ్య, MPDO మల్లీశ్వరి, AE PR సూరిబాబు, PHC డాక్టర్ మెరిసి, మరియు సచివాలయ సిబ్బంది PHC సిబ్బంది,పలు ప్రభుత్వ శాఖల అధికారులు, కూటమి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe