గాజువాక టీడీపీ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

గాజువాక టీడీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాజువాక శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎల్లా శ్రీనివాసరావు పాల్గొని సందడి చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన సంక్రాంతి వేడుకల్లో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, సంక్రాంతి అనేది తెలుగువారి ఐక్యత, సంప్రదాయాలు, కుటుంబ అనుబంధాలను ప్రతిబింబించే మహత్తర పండుగ అని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం బంధుమిత్రులతో కలిసి సంతోషంగా, ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. సంక్రాంతి సంతోషాల పండుగగా ప్రతి ఇంట్లో వెలుగులు నింపాలని, రైతుల కష్టాలకు ప్రతిఫలంగా ఈ పండుగ ఆశలు, ఆనందాన్ని తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చారు. పార్టీ కార్యాలయం పండుగ కళతో కళకళలాడుతూ, సంక్రాంతి సందడి గాజువాకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

WhatsApp Join Now
Youtube Subscribe