గజరాయునివలస లో కోలాహలంగా కోలాటం పోటీలు..కోలాటం పోటీలను ప్రారంభించిన కారుణ్య సంస్థ అధినేత జె సి రాజు

బొబ్బిలి బ్యూరో ఎల్లో సింగం ప్రతినిధి:-

బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో గల బాడం గి మండలం గజరాయునివలస గ్రామంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు రెండవ రోజున నిర్వహించిన ఉత్తరాంధ్ర కోలాటం పోటీలు కోలాహలంగా జరిగాయి.ఈ పోటీల ను కారుణ్యఫౌండషన్ అధినేత,రోటరీ జిల్లా చైర్మన్ జె సి రాజు ,గ్రామ సర్పంచ్ ఎం సత్య న్నారాయణ లు ప్రారంభించారు.ఈ సంద ర్భంగా జె సి రాజు మాట్లాడుతూ నిజమైన సంక్రాంతి ఆనందం కోలాటం పోటీలు నిర్వ హించటం ద్వారా పొందుతున్నామన్నారు. కోలాటం పోటీలను తిలకించటానికి పెద్ద ఎ త్తున ప్రజలు పాల్గొని తిలకించటం, ఆనంద పరవసంలో గ్రామ ప్రజలు అనుభూతి చెంద టం పెద్ద పండుగను పండుగగా యువత నిర్వహించటం గొప్ప విషయం అని అన్నా రు. కోలాటం పోటీల్లో మొత్తం 22 బృందా లు పాల్గొని ప్రదర్శనలు చేశారు. కోలాటం ప్రదర్శించడం లో బృందాలు పోటీ పడి ప్రద ర్శించటంలో ప్రజలను విశేషంగా ఆకట్టుకు న్నాయి. మొదటి విజేత జై దుర్గ భవాని శ్రీ కాకుళం బృందం, శ్రీ సక్తేశ్వర బృందం కామ న్న వలస ద్వితీయ స్థానం లో,శివరామకృ ష్ణ బృందం గజారాయునివలస తృతీయ స్థానంలో విజేతలుగా నిలిచారు.విజేతలకు కారుణ్య సంస్థ అధినేత జె రాజు, గ్రామ పెద్ద లు చేతుల మీదుగా మొదటిస్థానం 7వేలు, ద్వితీయ స్థానం 5వేలు,తృతీయ స్థానం 3 వేలు అందించారు.హాజరైన ప్రతి బృందానికి 12 వంద రూపాయలను బహుమతులుగా జె సి రాజు అందించారు. న్యాయ నిర్ణేతలు గా గౌరు నాయుడు, మానస ,కోలాటం గు రువులు వ్యవహరించారు.ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ కామునాయుడు, కృష్ణ మూర్తి,ప్రిన్సిపాల్ పురుషోది, నిర్వాహకులు చంద్ర శేఖర రావు,కోటేశ్వర ప్రసాద్, సాయి, జగన్,సురేష్ తదితరులు పాల్గొన్నారు…

WhatsApp Join Now
Youtube Subscribe