వేంపల్లి పట్టణంలో గంజాయి విక్రయాలు లేదా వినియోగానికి పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వేంపల్లి సీఐ నరసింహులు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో, పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ పర్యవేక్షణలో పోలీసులు గంజాయి విక్రయాల్లో పాల్గొన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1.05 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు. మళ్లీ ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు మరింత కఠినంగా ఉంటాయని తెలిపారు. గంజాయి లేదా ఇతర నిషేధిత మత్తు పదార్థాలపై సమాచారం ఉంటే ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని పోలీసులు కోరారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
