కొనసీమలో ఘనంగా ప్రారంభమైన ప్రభల జాతర

కొనసీమ జిల్లాలో సంప్రదాయ శోభతో ప్రభల జాతర ఘనంగా ప్రారంభమైంది. అంబాజీపేట కేంద్రంగా శివాలయాల్లో ఏకాదశ రుద్రుల ప్రభలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్న, భారీ ప్రభలతో ఊరేగింపు సాగి పట్టణం కోలాహలంగా మారింది. 11 గ్రామాల ప్రభలు వరి పొలాలు, కాలువల గుండా సాగుతూ భక్తులను ఆకట్టుకున్నాయి. కౌశిక నదిలో ప్రభల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుండగా, జగన్నతోటలో ప్రభల ప్రదర్శనతో ఉత్సవం ముగియనుంది.

WhatsApp Join Now
Youtube Subscribe