కొత్తగూడెం సింగరేణి సెంట్రల్ మెయిన్ వర్క్ షాప్ లో ఎఐటియుసి గేట్ మీటింగ్.

ఈనెల 18న ఖమ్మం పట్టణంలో జరిగే సిపిఐ పార్టీ శతాబ్ది వేడుకలు

ముగింపు భారి బహిరంగ సభకు సింగరేణి కార్మికులు ఆహ్వానించిన ఏఐటియుసి నేత మిరియాల రంగయ్యా.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లో సింగం

కొత్తగూడెం సెంట్రల్ వర్క్ షాప్ మరియు మెయిన్ వర్క్ షాప్ లో శుక్రవారం ఉదయం గుర్తింపు కార్మిక సంఘం ఎఐటియుసి ఆధ్వర్యం లో గేట్ మీటింగ్ నిర్వహించారు ఈ సమావేశం లో అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్యా మాట్లాడుతూ ఈనెల 18న ఖమ్మంలో జరుగు సీపీఐ పార్టీ శతాబ్ది ముగింపు బహిరంగ సభ కు సంఘటిత, అసంఘటిత కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సింగరేణి లో గుర్తింపు కార్మిక సంఘం ఎఐటియుసి ఎన్నికైనప్పటినుండి ఇప్పటివరకు కార్మికుల సమస్యలపై పోరాడుతూనే ఉందని అన్నారు,కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు సొంత ఇంటి పథకం అమలుచేయాలని, పెరిక్స్ మీద ఇన్కమ్ టాక్స్ యాజమాన్యం చెల్లించాలని, మారుపేర్ల సమస్య పరిష్కరించాలని, అదేవిధంగా మెడికల్ బోర్డు పెట్టకుండా యాజమాన్యం కాలయాపన చేస్తుంది అని మండిపడ్డారు. సి &ఎండి స్థాయి స్టక్చర్ కమిటీ సమావేశంలో ఒప్పుకున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి అన్నారు. ఫిబ్రవరి 12న నాలుగు లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా జరిగే దేశవ్యాప్త సమ్మె కు అన్ని మైన్స్ మరియు డిపార్ట్మెంట్స్ లలో కార్మికులు పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చెయ్యాలని కోరారు. అదేవిధంగా ఎఐటియుసి గుర్తింపు సంఘంగా గెలిచిన దగ్గరనుండి కార్మికుల పక్షాన నిలబడి అనేక
కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ముందుంది అన్నారు. అదేవిధంగా శీతాకాలం అసెంబ్లీ సమావేశం లో ఏఐటీయూసీ యూనియన్ గౌరవ అధ్యక్షులు కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు కార్మిక సమస్యల పై మాట్లాడడం వలన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి,బట్టి విక్రమార్క సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారని గుర్తు చేశాను. భవిష్యత్తులో కూడా కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో యూనియన్ నాయకులు సెంట్రల్ సెక్రెటరీ వంగ వెంకట, కార్పొరేట్ కార్యదర్శి ఎస్. వి.రమణ మూర్తి, సహాయ కార్యదర్శి రాము, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్టోఫర్, సెంట్రల్ వర్క్ షాప్ పిట్ సెక్రటరీ నరేష్, అడ్వైజర్ రాజేశ్వరరావు, పల్నాటి ప్రశాంత్,బి. రవీందర్, శ్యామ్, నరసింహ రామ్మోహన్, మెయిన్ వర్కుషాప్ పిట్ సహాయ సెక్రెటరీ దినేష్ సత్యనారాయణ మల్లయ్య అజయ్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe