కొటప్రొలు కృష్ణ సమక్షంలో నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి దశదిన కార్యక్రమానికి ఆర్ధిక సహాయం

హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ కడప జిల్లా ఎడ్యుకేషన్ సెల్ చైర్మన్‌గా గురివిగారి వాసు ఎన్నిక

​నందలూరు,ఫిబ్రవరి 2, (ఎల్లో సింగం ప్రతినిధి)

హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కడప జిల్లా ఎడ్యుకేషన్ సెల్ చైర్మన్‌గా గురివిగారి వాసు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు కౌన్సిల్ బాధ్యులు అధికారికంగా ఆయన నియామకాన్ని ప్రకటించారు.
​బాధ్యతల స్వీకరణ – కృతజ్ఞతలు:
ఈ సందర్భంగా గురివిగారి వాసు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన కౌన్సిల్ జాతీయ చైర్మన్ తాళ్లూరి ప్రసన్నకుమార్, రాయలసీమ చైర్మన్ నెసే జాన్, జిల్లా అధ్యక్షులు డాక్టర్ డేవిడ్ కళ్యాణ్ రాజ్, మరియు రాయలసీమ క్రైమ్ అండ్ డ్రగ్స్ చైర్మన్ వీరబల్లి జయకుమార్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
​విద్యే ఆయుధంగా ముందుకు సాగుతాం:
అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో సంస్థ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా:
​పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు విద్య యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, చదువు ద్వారానే సమాజంలో అసమానతలు తొలగిపోతాయని పేర్కొన్నారు.
​విద్యార్థులకు అందవలసిన హక్కులను సక్రమంగా అందేలా పోరాడుతామని తెలిపారు.
​జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు ఎదుర్కొనే న్యాయబద్ధమైన సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే,హెచ్ఆర్పిసి, తరపున అండగా ఉండి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.
​గ్యాస్ స్టవ్ విరాళం:
ఈ కార్యక్రమంలో భాగంగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు గురికిపాటి రామచంద్ర గ్యాస్ స్టవ్‌ను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ డేవిడ్ కళ్యాణ్ రాజ్ ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
​పాల్గొన్న ముఖ్య నేతలు:
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాచూరి మురళి హాజరయ్యారు. వీరితో పాటు అరుణ్ పాండే,బన్నీ, హర్ష వర్ధన్,సుదర్శన్,ఇబ్బు మరియు పత్రికా ప్రతినిధులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe