- నూతన మండల అధ్యక్షుల బాధ్యతలను సవాల్‌గా తీసుకోవాలి
- కస్తూరి విశ్వనాథ నాయుడు, మాచినేని విశ్వేశ్వర నాయుడులను కలిసిన నూతన అధ్యక్షులు
రైల్వే కోడూరు, జనవరి 11: ఎల్లో సింగం ప్రతినిధి
పెనగలూరు, చిట్వేలి మండలాలకు నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆదివారం రైల్వే కోడూరులోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర నాయకులను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథ నాయుడు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు పెనగలూరు మండల అధ్యక్షులు ఎంజర్ల నారాయణ రెడ్డి , చిట్వేలి మండల అధ్యక్షులు కాకర్ల నాగార్జున కలిసి ఘనంగా సన్మానించారు.
-పదవి ఒక బాధ్యత.. సవాల్‌గా తీసుకోవాలి
ఈ సందర్భంగా కస్తూరి విశ్వనాథ నాయుడు మాట్లాడుతూ.. గత ఐదేళ్ల అరాచక పాలనలో పార్టీ కోసం నిరంతరం శ్రమించిన నిజమైన కార్యకర్తలకు పదవులు వరించడం శుభపరిణామమని అన్నారు. పదవిని కేవలం హోదాగా కాకుండా ఒక బాధ్యతగా, సవాల్‌గా తీసుకొని పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నాయకుడిని, కార్యకర్తను కలుపుకొని కలిసికట్టుగా ముందుకు సాగాలని సూచించారు.
-కూటమి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన తిరిగి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మండల కమిటీలపై ఉందన్నారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు పార్టీలో గుర్తింపు ఉంటుందని, సమిష్టి కృషితో నియోజకవర్గంలో పార్టీని అజేయ శక్తిగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. అనంతరం నూతన అధ్యక్షులను కస్తూరి విశ్వనాథ నాయుడు గారు ఘనంగా అభినందించి సన్మానించారు.
-ప్రముఖుల సన్మానం
ఇదే క్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు గారిని, ప్రముఖ న్యాయవాది కేజేపి రెడ్డయ్య గారిని కూడా నూతన మండల పార్టీ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెనగలూరు మరియు చిట్వేలి మండలాలకు చెందిన ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
