కన్నులపండుగలా.. లంకాదహనం..!

లంక దహనాన్ని తిలకిచేందుకు వేల సంఖ్యలో భక్తులు

ఎల్లో సింగం న్యూస్ హోళగుంద జనవరి 29

హొళగుందలో శ్రీ సిద్ధేశ్వర స్వామి రథోత్సవంలో భాగంగా గురువారం సాయంత్రం నిర్వహించిన లంకాదహనం కార్యక్రమం అశేష జనవాహిని మద్య కన్నులపండుగగా అంగరంగ వైభోగంగా జరిగింది.ఈ లంకదహన ఆలయ ధర్మకర్త రాజాపంపన్నగౌడ్, సిద్ధార్థగౌడ్లు శివన్న గౌడ్ హరీష్ గౌడ లంకాదహనాన్ని ప్రారంభించారు. అంతకుముందు శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయ సన్నిధిలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములు ఎమ్మెల్యే తనయుడు చంద్రశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశికళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణ మోహన్ ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్క బడులను చెల్లించుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో ఆలూరు నియోజకవర్గం ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.దేవాలయ ఆవరణలో లంకాదహన కార్యక్రమం
గంటపాటు అంగరంగ వైభవంగా జరిగింది విచ్చేసిన భక్తులు ఆనందంలో మునిగితేలారు. ఈ కార్యక్రమంలో ఆలూరు సిఐ రవి శంకర్ రెడ్డి హోళగుంద ఎస్ఐ దిలీప్ కుమార్ గురజాల చిప్పగిరి, హలహర్వి ఆస్పరి ఎస్ఐలు 40 మంది సిబ్బందితో భారీ పోలీస్బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిక్కిలినేని శ్రీనివాసులు రావు సిబిఎన్ ఆర్మీ ముల్లా మొయిన్ వైసీపీ మండల కన్వీనర్ షఫీఉల్లా కో కన్వీనర్ కన్నయ్య జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గిరి ఎల్లార్తి చిన్నశశి మొహమ్మద్ సిద్దు వందవాగిలి శేషప్ప దిద్ది ఆంజనేయ మల్లయ్య కొండ అమ్రేష్ తదితర గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

WhatsApp Join Now
Youtube Subscribe