కంచికచర్ల చెవిటికల్లులో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్ (IFC) జీవనోపాదుల సేవ కేంద్రం ప్రారంభం.

రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా కూటమి నేతలతో కలిసి సేవ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ..

కంచికచర్ల ఎల్లో సింగం రిపోర్టార్

మండలంలో చెవిటికల్లు గ్రామంలో శుక్రవారం నాడు రైతుల జీవనోపాదుల అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్ (IFC) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీవనోపాదుల సేవ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, రైతులు కేవలం వ్యవసాయంపై మాత్రమే ఆధారపడకుండా అనుబంధ రంగాలైన పశుపోషణ, మత్స్యకారము, కోళ్ల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి విభిన్న ఉపాధి అవకాశాలను వినియోగించుకునేలా ఈ IFC జీవనోపాదుల సేవ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, రైతులు స్వయం ఆధారితంగా ఎదగేందుకు ఇలాంటి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ సేవ కేంద్రం ద్వారా రైతులకు అవసరమైన శిక్షణ, సాంకేతిక సలహాలు, మార్కెటింగ్ సహాయం అందుబాటులోకి వస్తాయని అధికారులు వివరించారు. అలాగే ప్రభుత్వ పథకాలను రైతులకు చేరవేసే వేదికగా కూడా ఈ కేంద్రం పనిచేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాంచారయ్య, మార్కెట్ కమిటీ గా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్లు , మండల సమైఖ్య అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు, వ్యవసాయ శాఖ అధికారులు,గ్రామస్తులు, డ్వాక్రా సంఘాల మహిళలు, పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామీణాభివృద్ధి దిశగా చేపడుతున్న చర్యలకు రైతులు హర్షం వ్యక్తం చేశారు.

WhatsApp Join Now
Youtube Subscribe