ఏపీ–తెలంగాణ కోర్టులకు బాంబ్ బెదిరింపులు – భద్రతా చర్యలు కట్టుదిట్టం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబ్ బెదిరింపులు రావడం కలకలం రేపింది. రాజమండ్రి జిల్లా కోర్టు, హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు, కరీంనగర్ జిల్లా కోర్టులకు బెదిరింపు సందేశాలు అందినట్లు సమాచారం.

కరీంనగర్ జిల్లా కోర్టులో బాంబులు అమర్చామని, మధ్యాహ్నం 12:05 గంటలకు పేలుతాయని ఈమెయిల్ ద్వారా హెచ్చరిక వచ్చినట్లు తెలిసింది. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై కోర్టు ఆవరణలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

బాంబ్ బెదిరింపుల నేపథ్యంలో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్‌లు సమగ్ర తనిఖీలు చేపట్టాయి. న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని జాగ్రత్త చర్యగా బయటికి పంపించి తనిఖీలు కొనసాగించారు. బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులపై దర్యాప్తు కొనసాగుతోంది. అధికారులు ప్రజలను ఆందోళన చెందవద్దని సూచించారు.

WhatsApp Join Now
Youtube Subscribe