భారీ లక్ష్యాలతో ముందుకెళ్లి నిరంతర కృషితో ఫలితాలు సాధించడమే తన పని విధానమని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. దావోస్ పర్యటనలో భాగంగా జాతీయ, అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన, ఏపీ పరిశ్రమలకు అనుకూల రాష్ట్రంగా మారిందన్నారు. ఈజ్ ఆఫ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో వేగంగా అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. గూగుల్ విశాఖకు రావడం రాష్ట్రానికి పెద్ద ముందడుగని, అగ్రిటెక్, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమ్మోనియా రంగాల్లో ఏపీ ముందంజలో ఉందన్నారు. అమరావతిని టెక్నాలజీ, గ్రీన్-బ్లూ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని, ఏపీ విధానాలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందని చంద్రబాబు వెల్లడించారు.
ఏపీ గురించి అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామిక రంగం చర్చించుకుంటోంది
21
Jan
WhatsApp
Join Now
Youtube
Subscribe
