ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో ఘనంగా భోగి సంబరాలు

పార్వతీపురంలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో భోగి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలుగుదేశం పార్టీ కార్యాలయం తెలిపింది. బుధవారం ఉదయం 5 గంటలకు పార్వతీపురంలోని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర నివాసం వద్ద భోగి మంటలు వేసి సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపనున్నారు. ఈ సందర్భంగా భోగి పండుగ ప్రాముఖ్యతను చాటుతూ కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి సంబరాల్లో పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమానికి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై భోగి వేడుకలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర విజ్ఞప్తి చేశారు. సంప్రదాయాలు, సంస్కృతి పరిరక్షణకు భోగి పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. పండుగను అందరూ ఐక్యంగా, ఆనందంగా జరుపుకోవాలని కోరారు. భోగి సంబరాలు ప్రజల్లో ఐక్యతను పెంపొందించి, నూతనోత్సాహాన్ని నింపుతాయని టీడీపీ నాయకులు తెలిపారు.

WhatsApp Join Now
Youtube Subscribe