ఎన్టీఆర్ విగ్రహంపై దాడి దురదృష్టకరం ఎమ్మెల్యే కోళ్ల

దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీస్ శాఖను ఆదేశించిన ఎమ్మెల్యే

ద్వంశమైన విగ్రహాన్ని సందర్శించిన రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాం ప్రసాద్,

శృంగవరపుకోట ఎల్లో సింగం ప్రతినిధి జనవరి 16:- శృంగవరపుకోట నియోజకవర్గం లక్కవరపుకోట, మండలం సీతారాంపురం గ్రామంలో గల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రుల ఆరాధ్య దైవం అయినటువంటి స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహం శుక్రవారం వేకువ జామున ధ్వంసం చేయడం దురదృష్టకరమని విగ్రహ ద్వంసం పాల్పడిన వ్యక్తులను త్వరితగతిన గుర్తించి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి ఆదేశించారు అలానే నియోజకవర్గంలో ఇలాంటివి మళ్లీ పునరావతం కాకుండా చూడాలని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు,
రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల అప్పల బాలాజీ రాంప్రసాద్, సంఘటన స్థలాన్ని మండల నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి సందర్శించి విగ్రహదుప్సం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కు దేశంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని అటువంటి మహనీయుని విగ్రహాన్ని ధ్వంసం చేయటం సరియైన పని కాదని ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను రాం ప్రసాద్ గారు కోరారు. సంఘటనకు సంబంధించి విచారణ చేసి, నేరస్థులను త్వరగా పట్టుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కరెడ్ల ఈశ్వరరావు, సీఐ అప్పలనాయుడు, ఎస్సై సుదర్శన్, అక్కిరెడ్డి రమణ, మరియు తదితరులు పాల్గొన్నారు…*

WhatsApp Join Now
Youtube Subscribe