ఎన్టీఆర్ లా!!

తెలుగుజాతి కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చాటిన తెలుగుజాతి ముద్దుబిడ్డ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి వర్ధంతి సందర్భంగా వేటపాలెం రామన్నపేట నందు ఆ మహానుభావుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు, యువ నాయకులు శ్రీ మద్దులూరి గౌరీ అమర్నాథ్ గారు మరియు కూటమి నాయకులు.

తెలుగు రాష్ట్రాల ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు, సినీ రంగంలో శిఖర స్థాయికి ఎదిగి, రాజకీయాల్లో ప్రజా నాయకుడిగా విశిష్ట గుర్తింపు పొందారు. తన అపార ప్రతిభ, ఆత్మనిబ్బరం, ప్రజాసేవా తపనతో సాధించిన విజయాలు ఆయన మరణానంతరం కూడా ప్రజల హృదయాల్లో వెలుగుతూనే ఉన్నాయి.
తెలుగువాడు ఎలా ఉంటాడు!
ఎన్టీఆర్ లా!!
రాముడు, కృష్ణుడు ఎలా ఉంటాడు!
ఎన్టీఆర్ లా!!
అన్న ఎలా ఉండాలి!
ఎన్టీఆర్ లా!!
నటుడు ఎలా ఉండాలి!
ఎన్టీఆర్ లా!!
వాచకం ఎలా ఉండాలి!
ఎన్టీఆర్ లా!!
క్రమశిక్షణ ఎలా ఉండాలి!
ఎన్టీఆర్ లా!!
నాయకుడు ఎలా ఉండాలి!
ఎన్టీఆర్ లా!!
ప్రశ్నలు మాత్రమే మారుతాయి. సమాధానం మారదు.
తెలుగువారి జ్ఞాపకం లెజెండ్ ఎన్టీఆర్ 30 వ వర్దంతి సందర్బంగా మహానీయుడికి ఘన నివాళులు.

WhatsApp Join Now
Youtube Subscribe