ఎన్టీఆర్ భరోసా పింఛన్లు నిరుపేదలకు వరం

  • బలిజిపేట మండలం అంపావలిలో ఎన్టీఆర్ పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర..

బొబ్బిలి బ్యూరో ఎల్లో సింగం ప్రతినిధి:- సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు నిరుపేద ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రూ.4వేలు అందిస్తున్నదని ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పేదలకు వరంలా నిలుస్తున్నదని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పేర్కొన్నారు. బలిజిపేట మండలం అంపావల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్సన్లను ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర లబ్దిదారులకు శనివారం పంపిణీ చేశారు. అదికారులు, టీడీపీ నాయకులతో కలిసి లబ్దిదారుల ఇళ్లకు వెల్లిన ఎమ్మెల్యే, పెన్షన్ దార్లను కలిసి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ మొత్తాన్ని వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలోను లేని విదంగా పెద్దమొత్తంలో పెన్షన్లు అందచేస్తోందని తెలిపారు. ప్రతీ నెలా ఒకటో తేదీన కాకుండా ఒకటో తేదీన ఆదివారం అయితే శనివారం నాడే అధికారులు ఇంటివద్దకే వెళ్లి పెన్షన్లు అందించడం దేశంలో మొదటిసారి అని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వృద్ధులు,వికలాంగులు, వితంతువులకు కొండంత భరోసానిస్తున్నాయని వెల్లడించారు. ప్రజల కష్టాలు తెలిసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమేనని, సమాజంలో ప్రతీఒక్కరు ఎదగాలని నిరంతరం తపన పడుతుంటారని తెలిపారు. గత మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ స్థలాలను, భూములను కబ్జా చేసి సుమారు రూ.500 కోట్లకు పైగా ఆస్తులను అక్రమంగా సంపాదించారన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రైతులకు చెందిన పట్టాదారు పాస్ పుస్తకాలపై అతని ఫోటోలు వేయించికొని, వాటిని కాజేందుకు కుట్ర పన్నారన్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు ఎంతో చైతన్యంతో వైసీపీని ఓడించారన్నారు. ఈ సందర్భంగా అంపావల్లి గ్రామ ప్రజలతో మాట్లాడుతూ గ్రామంలో సిసి రోడ్లు, సిమెంట్ కాలువల నిర్మాణానికి నిధులు మంజూరుకు అత్యంత ప్రాధాన్యత నిచ్చామన్నారు . ప్రజా సమస్యలు కూడా అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా గ్రామంలోకి అడుగుపెట్టిన ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ను గ్రామీణ మహిళలు ప్రజలు ఘన స్వాగతం పలికి కుంకుమ కర్పూర హారతులతో నుదుటిన కుంకుమ తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు..

WhatsApp Join Now
Youtube Subscribe