ఉపాధ్యాయ సంఘాలు మార్గదర్శకంగా నిలవాలి

విద్యాప్రమాణాల పెంపుకు కృషి చేయండి

రాష్ట్ర మైనార్టీ సంక్షేమం మరియు న్యాయ శాఖామాత్యులు ఎన్ఎండి ఫరూక్

నంద్యాల జనవరి 10
( ఎల్లో సింగం ప్రతినిధి )

నంద్యాల…. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంపొందించేలా కృషి చేయాలని అలాగే ఉపాధ్యాయ సంఘాలు విద్యాప్రమాణాలను పెంపొందించటానికి పాటు పడాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ మరియు న్యాయశాఖామాత్యులు ఎన్ఎండి ఫరూక్ కోరారు. రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ, రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ సంఘాల కాలెండర్లను, డైరీలను మంత్రి ఫరూక్ శనివారం తన నంద్యాల క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాలు మార్గదర్శక ధోరణితో విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో భాషోపాధ్యాయ సంస్థ నంద్యాల జిల్లా అధ్యక్షులు కన్నయ్య, కార్యదర్శి వుశేన్ మియ్యా, సంఘనాయకులు వెంకటరాముడు, నబీసా, దామోధర్ ,నరేంద్ర,రఫీ, హబీబుల్లా, రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ సంఘనాయకులు అన్నెం శ్రీనివాసరెడ్డి, శేషఫణి, డా.నీలం వెంకటేశ్వర్లు, మాబుబాష తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe