ఈసారి ఆదాయపు పన్ను ఊరట లేనట్లే..!

ఆదాయపు పన్ను తగ్గింపుపై ఆశతో ఎదురుచూసిన వేతన జీవులకు 2026 కేంద్ర బడ్జెట్‌లో నిరాశే ఎదురైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కొత్త పన్ను మినహాయింపులు ప్రకటించలేదు. అయితే విధానపరంగా కొంత ఊరట లభించింది. ఐటీఆర్‌–1, ఐటీఆర్‌–2 దాఖలుకు జులై 31 వరకు, నాన్‌ ఆడిట్‌ వ్యాపారాలు, ట్రస్ట్‌లకు ఆగస్టు 31 వరకు గడువు ఇచ్చారు. రివైజ్డ్‌ రిటర్నుల గడువును డిసెంబర్‌ 31 నుంచి మార్చి 31కి పొడిగించారు.

ఏప్రిల్‌ నుంచే కొత్త ఆదాయపు పన్ను చట్టం

2026 ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రానుంది. పన్ను నిబంధనలను మరింత సరళతరం చేసినట్లు మంత్రి తెలిపారు. కొత్త, పాత పన్ను విధానాల్లో స్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు.

స్టాక్‌మార్కెట్‌పై ప్రభావం

ఫ్యూచర్స్‌పై ఎస్‌టిటిని 0.02 నుంచి 0.05 శాతానికి, ఆప్షన్స్‌ ప్రీమియంపై 0.15 శాతానికి పెంచారు. షేర్ల బైబ్యాక్‌లను క్యాపిటల్‌ గెయిన్స్‌గా పరిగణించి పన్ను విధించనున్నారు.

అలాగే విద్యార్థులు, టెక్‌ ప్రొఫెషనల్స్‌, ఎన్నారైలకు ఆరు నెలల ఫారిన్‌ అసెట్స్‌ డిస్‌క్లోజర్‌ అవకాశం కల్పించారు. ఎన్నారైల ఆస్తుల విక్రయంపై టీడీఎస్‌కు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. విదేశీ టూర్‌ ప్యాకేజీలపై టీసీఎస్‌ను 2 శాతానికి తగ్గించారు. మోటార్‌ ప్రమాద పరిహారాలపై ఆదాయపన్నును పూర్తిగా తొలగించారు.

WhatsApp Join Now
Youtube Subscribe