కుప్పం, జనవరి 19/ఎల్లో సింగం
కుప్పంలో ఈరోజు ఘనంగా రైల్వే స్టేషన్ లో విజయవాడ ట్రైన్ కి పూజలు నిర్వహించారు
ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పి ఎస్ మునిరత్నం,, ఉడ చైర్మన్ డాక్టర్ సురేష్, మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్, రెస్కో చైర్మన్ ప్రతాప్, రాజకుమార్, డా.వెంకటేష్ బిజెపి తులసి నాథ్, జనసేన నరేష్ తదితరుల చేతుల మీదుగా జెండా ఊపి , పూజలు నిర్వహించడం జరిగింది. పిఎస్ మునిరత్నం డాక్టర్ సురేష్ మాట్లాడుతూ
కుప్పం ప్రజలు విజయవాడ వెళ్ళుటకు కొత్తగా మూడు వారాంతపు రైళ్లను కుప్పంలో స్టాపింగ్ మంజూరు చేయించుటకు కృషిచేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి రైల్వే శాఖ మంత్రి అశ్లీని వైష్ణవ్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
కి , చిత్తూరు ఎంపీ డి ప్రసాద్ రావు కి, చిత్తూరు ఎమ్మెల్సీ కంచర శ్రీకాంత్ కి, రైల్వే అధికారులకు తెలిపారు మరో రెండు రైళ్లు కుప్పం ప్రజలకు విజయవాడ మీదుగా కలకత్తా, అస్సాం వరకు వెళ్ళుటకు ఎంతో దోహదకారిగా ఉపయోగపడుతుందని తెలిపారు
అదేవిధంగా
16597 ఎస్ ఎమ్ వీటి బెంగళూరు -అళిపుర్దార్ వారాంతపు అమృత్ భారత్ ఎక్సప్రెస్ రైలు , ప్రతి శనివారం ఉదయం 08:50 కు బెంగళూరు లో బయలుదేరి కుప్పం కు సుమారు 10:40 గంటలకు చేరుకుని , అదే రోజు రాత్రి 09:30 కు విజయవాడ చేరుకొని అక్కడ నుండి భుబనేశ్వర్ , కోల్‌కతాల మీదుగా అళిపుర్దార్ కు వెళ్తుంది తిరుగు ప్రయాణంలో
16598 అళిపుర్దార్ – ఎస్ ఎమ్ వీటి బెంగళూరు వారాంతపు అమృత్ భారత్ ఎక్సప్రెస్స్ రైలు ప్రతి బుధవారం విజయవాడలో మధ్యాహ్నం 01:45 కు బయలుదేరి , కుప్పం కు గురువారం ఉదయం సుమారు 01:00 కు చేరుకొని , అదే రోజు ఉదయం 03:00కు ఎస్ ఎమ్ వీటి బెంగళూరు చేరుకుంటుంది
మూడవ వారాంతపు ట్రైను
16223 ఎస్ ఎమ్ వీటి బెంగళూరు – రాధికపూర్ వారాంతపు ఎక్సప్రెస్ రైలు ప్రతి గురువారం మధ్యాహ్నం 01:50 కు బెంగళూరు లో బయలుదేరి అదే రోజు సాయంత్రం సుమారు 04:00కు కుప్పం కు చేరుకొని మరుసటి రోజు (శుక్రవారం ) ఉదయం 03:30 కు విజయవాడ చేరుకుంటుంది
అదే విధంగా 16224 రాధికపూర్ – ఎస్ ఎమ్ వీటి బెంగళూరు వారాంతపు ఎక్సప్రెస్ రైలు ప్రతి మంగళవారం విజయవాడ లో ఉదయం 06:30కు బయలుదేరి , అదే రోజు సాయంత్రం సుమారు 07:00 కు కుప్పం చేరుకొని , అదే రోజు రాత్రి 08:45 కు ఎస్ ఎమ్ వీటి బెంగళూరు చేరుకుంటుంది
3) 16523 ఎస్ ఎమ్ వీటి బెంగళూరు – బాలుఁర్ఘాట్ వారాంతపు ఎక్సప్రెస్ రైలు ప్రతి బుధవారం ఉదయం 10:15 కు బెంగళూరు లో బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం సుమారు 12:00 కు కుప్పం కు చేరుకొని అదే రోజు రాత్రి 11:00కు విజయవాడ చేరుకుంటుంది
అదే విధంగా 16524 బాలుఁర్ఘాట్ – ఎస్ ఎమ్ వీటి బెంగళూరు వారాంతపు ఎక్సప్రెస్ రైలు ప్రతి ఆదివారం విజయవాడ లో మధ్యాహ్నం 12:45కు బయలుదేరి , మరుసటి రోజు(సోమవారం ) ఉదయం సుమారు 01:00కు కుప్పం చేరుకొని , అదే రోజు (సోమవారం )ఉదయం 03:00 కు బెంగళూరు చేరుకుంటుంది.ఈ సందర్భంగా రైల్వే లోకో పైలట్లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్, రెస్కో చైర్మన్ ప్రతాప్, రాజ్ కుమార్, డా.వెంకటేష్, కాణిపాకం వెంకటేష్, కౌన్సిలర్లు సోము దాము జాఫర్, ఆర్ఆర్ రవి, కన్నన్, సతీష్, బాబు ,సాయి మాత సేవ ట్రస్ట్ జగదీష్ బాబు తదితరులు పాల్గొన్నారు
