ఈకేవైసీ త్వరగా పూర్తి చేయాలి…

జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి

సచివాలయం, ఆర్ఎస్కే తనిఖీ

బొబ్బిలి బ్యూరో ఎల్లో సింగం ప్రతినిధి:-

ఈకేవైసీని త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. బొబ్బిలి మండలం మెట్టపల్లి సచివాలయం, రైతు సేవా కేంద్రం, ఆయుష్మాన్ భారత్ వెల్ నెస్ సెంటర్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ముందుగా సచివాలయం సిబ్బంది హాజరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సిబ్బంది ప్రస్తుతం ఏ విధుల్లో నిమగ్నమై ఉన్నారో తెలుసుకున్నారు. రిసర్వే, ఇకేవైసి ప్రక్రియల గురించి సచివాలయ సిబ్బందిని ప్రశ్నించారు. ఈకేవైసీని త్వరగా పూర్తి చేయాలని సూచించారు.ధాన్యం సేకరణపై ఆరెస్కె సిబ్బందిని ప్రశ్నించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలగురించి వెల్ నెస్ సెంటర్ సిబ్బందిని అడిగారు. మందులను, వైద్య పరికరాలను కలెక్టర్ పరిశీలించారు. తనిఖీలో తహసీల్దార్ ఎం. శ్రీను పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe