ఆహార నాణ్యతలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

సీతంపేట జనవరి 8(ఎల్లో సింగం)

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నభోజన పథకం అమలు, అంగన్వాడీ కేంద్రాలనిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం వహించినాసహించేది లేదని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులుబి. కాంతారావు స్పష్టం చేశారు.గురువారంసీతంపేట మండలంలో విస్తృతంగా పర్యటించి,పలు రేషన్ దుకాణాలు, పాఠశాలలు, అంగన్వాడీకేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుతస్థానిక గిరిజన ట్రైబల్ వెల్ఫేర్ బాలుర ఆశ్రమపాఠశాలను సందర్శించిన ఆయన అక్కడవిద్యార్థులకు వడ్డించిన అన్నం సరిగ్గా ఉడకలేదని,ఆహార నాణ్యత లోపాలు అధికంగా ఉన్నాయనిగుర్తించారు. వంట మాస్టర్ నిర్లక్ష్యంపై తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై వెంటనే చర్యలుతీసుకోవాలని అధికారులను ఆదేశించారు.హడ్డుబంగి గిరిజన ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలవిద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా కూరగాయలువాడాలని హెచ్చరించారు. సీతంపేట గర్ల్స్ గురుకుల పాఠశాలలో వంట బాగున్నప్పటికీ, పరిసరాలుఅపరిశుభ్రంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేస్తూపరిశుభ్రత పాటించాలని సూచించారు. సీతంపేటలోని అంగన్వాడీ కేంద్రం తనిఖీలో కోడిగుడ్లబరువులో హెచ్చుతగ్గులు ఉన్నట్లు గుర్తించారు.సీతంపేట బాలుర ఆశ్రమ పాఠశాలలో భోజనాన్నివెంటనే కాంట్రాక్టర్తో మాట్లాడి హెచ్చరించడమేకాకుండా, ఈ అంశంపై కలెక్టర్కు అధికారికంగాఫిర్యాదు చేయాలని ఐసిడిఎస్ అధికారులనుఆదేశించారు. అలాగే జామి తోట అంగన్వాడీకేంద్రంలో రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడంపైసిబ్బందిని హెచ్చరించారు. గొయిద, హడ్డుబంగిగ్రామాల్లోని రేషన్ దుకాణాలను పరిశీలించారు.హడ్డుబంగిలోని రేషన్ షాపులో సరైన రికార్డులులేని కారణంగా డీలర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ,నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేశారు.అనంతనం స్థానిక ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులతోమాట్లాడిన ఆయన ప్రభుత్వం అందిస్తున్న ‘తల్లికివందనం’, ‘డొక్కా సీతమ్మ మధ్యహ్న భోజనం’ వంటిపథకాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతశిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకుపిలుపునిచ్చారు. కార్యక్రమంలో సివిల్ సప్లైఅసిస్టెంట్ మేనేజర్ చిన్నికృష్ణ, సిఎసిటీలు రమేష్,సన్యాసిరావు, విద్యాశాఖ ఎడి రామజ్యోతి, జిసిడిఒభారతి, ఎంఇఒ, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వినోద్ కుమార్,ఐసిడిఎస్ అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe