ఆల్‌టైమ్‌ హై కి బంగారం, వెండి ధరలు.

దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు చరిత్రాత్మక గరిష్ఠ స్థాయికి చేరాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.లక్షన్నరకు చేరువవుతుండగా, వెండి ధర కిలోకు రూ.3 లక్షలు దాటింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,580గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,37,580గా నమోదైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3,01,000కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లలో బంగారానికి పెరుగుతున్న డిమాండ్‌, డాలర్‌ మారకం విలువల్లో మార్పులు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ధరల పెరుగుదలకు కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని ఆశ్రయించడంతో డిమాండ్‌ మరింత పెరిగింది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ సమీపిస్తుండటంతో రిటైల్‌ మార్కెట్‌లో కూడా కొనుగోళ్లు ఊపందుకున్నాయి.

WhatsApp Join Now
Youtube Subscribe