ఆర్టీసికి అసలైన పండగ తెచ్చిన సంక్రాంతి

సంక్రాంతి సీజన్‌ ఏపీఎస్ఆర్టీసీకి అపూర్వ విజయాన్ని అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికుల రాకపోకలు భారీగా పెరగడంతో సంస్థ ఆదాయంతో పాటు సేవల్లోనూ సరికొత్త రికార్డులు సృష్టించింది. జనవరి 19న ఒక్కరోజులోనే ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఆదాయం నమోదు కావడం ఆర్టీసీ చరిత్రలో మైలురాయిగా నిలిచింది.

ప్రయాణికుల అవసరాలను ముందుగానే గుర్తించి అదనపు బస్సులు, ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయడం ఈ విజయానికి ప్రధాన కారణమైంది. ప్రైవేట్ బస్సుల్లో ప్రమాదాలు, అధిక చార్జీల కారణంగా ఈసారి ఎక్కువ మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలనే ఆశ్రయించారు. చార్జీలు పెంచకుండా, సురక్షిత ప్రయాణాన్ని అందించడంతో ప్రజల్లో ఆర్టీసీపై విశ్వాసం మరింత పెరిగింది.

జనవరి 19న రూ.27.68 కోట్ల ఆదాయం ఆర్జించడం, 50.6 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చడం సంస్థ పనితీరుకు నిదర్శనంగా నిలిచింది. తిరుగు ప్రయాణాల కోసం ముందస్తు ఏర్పాట్లు, ఆన్‌లైన్ బుకింగ్, టిక్కెట్ కౌంటర్ల సమన్వయం ప్రయాణికులకు సౌకర్యం కల్పించాయి.

ఈ ఘన విజయానికి కృషి చేసిన డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది, అధికారులను ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు అభినందిస్తూ, భవిష్యత్తులోనూ ఇదే సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు.

WhatsApp Join Now
Youtube Subscribe