ఆంధ్రప్రదేశ్‌లో 1.11 కోట్లు విద్యార్థులకు ఉచిత నులిపురుగు నివారణ మందులు పంపిణీ

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కాలేజీలలో 1 నుండి 19 ఏళ్లలోపు విద్యార్థులకు ఉచితంగా నులిపురుగుల నివారణ మందులు (Albendazole 400MG) పంపిణీ చేయబడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.11 కోట్ల మంది విద్యార్థులు ఈ మందులు పొందనున్నారు.

నులిపురుగుల కారణంగా చిన్న వయసులోనే పిల్లల్లో ఆకలి మందగించడం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, రక్తహీనత, ఎముకల పెరుగుదల లోపం వంటి సమస్యలు కలుగుతాయి. ఈ ఆల్బెండజోల్ మాత్రల ద్వారా నులిపురుగుల ప్రభావాలను నివారించి, పిల్లల ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచవచ్చు.

తల్లిదండ్రులకు ముఖ్య సూచన: ఈరోజు పిల్లలు తప్పకుండా స్కూల్ లేదా అంగన్వాడీ కేంద్రంకు వెళ్లి ఈ మందులు తీసుకోవడం నిర్ధారించాలి. ప్రభుత్వం చిన్న వయసులోనే ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, ఈ కార్యక్రమం ద్వారా పిల్లల సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యంగా ఉందని తెలిపింది.

WhatsApp Join Now
Youtube Subscribe