అవనిగడ్డలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ – లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నగదు అందజేసిన టీడీపీ నేతలు.


అవనిగడ్డ;31/1/2026:; ఎల్లో సింగం న్యూస్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అవనిగడ్డ నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో జరిగింది. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో పాటు ప్రభుత్వ ఆదేశాల మేరకు, శనివారం ఉదయం నుంచే నియోజకవర్గ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీని ప్రారంభించారు. అవనిగడ్డలో తెలుగుదేశం పార్టీ నాయకులు సచివాలయ సిబ్బందితో కలిసి వార్డుల్లో పర్యటించారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఇళ్ల వద్దకే నేరుగా వెళ్లి, పెన్షన్ నగదును అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం, పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారాని అన్నారు . అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా పెన్షన్ అందజేయడమే మా లక్ష్యం అని ఈ సందర్భంగా టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు తెదేపా నేతలు బండే రాఘవ,దాసినేని శ్రీనివాసరావు,ఘంటసాల రామమోహనరావు,షేక్ బాబావలి,మెగవత్తు గోపి,చెన్నగిరి అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Youtube Subscribe