అలజడి సృష్టించేందుకే వైకాపా కుట్రలు.. ఆ ట్రాప్‌లో పడొద్దు: సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో హింసకు ప్రేరేపించేందుకు వైకాపా కుట్రలు చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. మంత్రులు, సీనియర్ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో వైకాపా అడ్డంగా దొరికిపోయిందన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా వైకాపా ట్రాప్‌లో పడొద్దని పిలుపునిచ్చారు. తప్పు చేసిన వారందరినీ చట్టపరంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.

WhatsApp Join Now
Youtube Subscribe