అరసవల్లిలో భక్తుల రద్దీ.. నియంత్రణకు కీలక నిర్ణయం

రథసప్తమి సందర్భంగా అరసవల్లిలోని ఆదిత్యుని ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. విపరీతమైన రద్దీ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల విక్రయాన్ని నిలిపివేయడంతో పాటు ఇప్పటికే జారీ చేసిన అన్ని రకాల పాస్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భక్తుల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రద్దీని సక్రమంగా నియంత్రించి ప్రతి భక్తుడికి దర్శనం కల్పిస్తామని జిల్లా కలెక్టర్‌ స్పష్టం చేశారు. అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం భక్తుల తాకిడి అధికంగా ఉన్నందున వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, చిన్నపిల్లలతో వచ్చే వారు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరారు.

WhatsApp Join Now
Youtube Subscribe