జగ్గయ్యపేట పట్టణంలో గల శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో జగ్గయ్యపేట పట్టణానికి చెందిన 29వ వార్డ్ కౌన్సిలర్ కంచేటి గీతారాణి గారి కుమారుడు గోపి స్వామి ఇరుముడి కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు, జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు గారు పాల్గొని టెంకాయ వేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోపి స్వామికి ఆశీర్వాదాలు అందజేసి, కార్యక్రమం విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్థానిక భక్తులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అయ్యప్ప స్వామి ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్
02
Jan
WhatsApp
Join Now
Youtube
Subscribe
