అభివృద్ధి–సంక్షేమాల మేళవింపుగా రాష్ట్ర బడ్జెట్ : ఎంపీ పుట్టా మహేష్ కుమార్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అభివృద్ధి మరియు సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇస్తూ రూపొందించబడిందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ లో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ.3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన స్పందించారు. విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా అన్ని రంగాలకు, అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించారని అన్నారు.

బీసీ కాంపోనెంట్‌కు రూ.51,021 కోట్ల భారీ కేటాయింపులు చేయడం, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికి నిధులు పెంచడం అభినందనీయం అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.6,105 కోట్లు, మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.18,224 కోట్లు కేటాయించడం ద్వారా పనులు వేగవంతమవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అమరావతికి రూ.6,000 కోట్లు, గృహనిర్మాణానికి రూ.6,350 కోట్లు, మౌలిక సదుపాయాలకు రూ.13,546 కోట్లు కేటాయించడం అభివృద్ధికి దోహదమని తెలిపారు. రైతుల సంక్షేమం, విద్యా–వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇచ్చిన ఈ బడ్జెట్ రాష్ట్ర పురోగతికి దిశానిర్దేశం చేస్తుందని ఎంపీ పేర్కొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe