అన్నగారి 30 వ వర్ధంతి అన్నగారికి భారతరత్న ఇవ్వాలి.

అన్నగారి 30 వ వర్ధంతి అన్నగారికి భారతరత్న ఇవ్వాలి. విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం లో ఉన్న 79 వ వార్డు పరిధి అగనంపూడి లో జూబ్లీహిల్స్ కాలనీలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నందమూరి తారక రామారావు గారు 30వ వర్ధంతి గాజువాక నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు గొల్లవిల్లి కనక భవాని ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె అన్న ఎన్టీఆర్ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదం పార్టీని స్థాపించి 9 నెలలు అధికారం చేపట్టి, పేదవాడికి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు కల్పించారు .మహిళా పక్షపాతని, మహిళలకి ఆస్తుల సమాన వాట కల్పించి, వృద్ధులకు పింఛన్లు దేశంలోనే మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన ఘనత ఎన్టీఆర్. అన్న ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల కోరుకొను నెరవేర్చాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

WhatsApp Join Now
Youtube Subscribe