అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బాలుడిని. ఆర్థిక సహాయం

రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంస్ మాజీ చైర్మన్ కొత్వాల

పాత పాల్వంచ గ్రామస్థుల ద్వారా బాలుడి కుటుంబానికి 1 లక్షా 53 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేసిన కొత్వాల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లో సింగం

పాల్వంచ టౌన్.అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పాత పాల్వంచకు చెందిన బాలుడు బద్రిని మానవత్వంతో ఆదుకోవాలని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.

46వ డివిజన్.పాత పాల్వంచకు చెందిన సీతారామరాజు, ప్రమీల దంపతుల కుమారుడు బద్రి ఇటీవల అనారోగ్యంతో పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి వైద్య చికిత్స నిమిత్తం వెళ్ళగా ఇంజక్షన్ వికటించి తీవ్ర అనారోగ్యం పాలవగా, విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యానికి లక్షలాది రూపాయలు అవసరమవుతుండగా పాత పాల్వంచలోని కొంత మంది దాతలు మానవత్వంతో 1 లక్షా 53 వేల రూపాయలు సేకరించారు.

పాత పాల్వంచలోని కొత్వాల స్వగృహంలో.బుధవారం ఈ పైకాన్ని కొత్వాల తోపాటు 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి.లు బాలుడి తండ్రి సీతారామరాజుకు అందజేశారు

ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ బాలుడి చికిత్సకు లక్షల రూపాయలు అవసరం వుందని, దాతలు విరాళాలు ఇచ్చి ఆదుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో.గ్రామస్థులు శిరీష, గౌరీ, నాగమణి, ఆదిలక్ష్మి, వినయ్, వసుమల్ల సుందరరావు.తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe