అంబటి రాంబాబు వాక్యాలపై ఫైర్ అయిన డా.పూరిమిట్ల కుమారి

తిరుపతి లొ ఆర్ టి సి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పై అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ తిరుపతి ఇంచార్జ్ సుగుణమ్మ గారి అద్వారం లో జరిగింది.. , తుడా చైర్మెన్, డాలర్స్ దివాకర్ రెడ్డి ,గారు, యాదవ కార్పొరేషన్ చైర్మెన్ నరసింహ యాదవ్ గారు, డా పూరిమిట్ల కుమారి గారు.ఏపీ స్టేట్ యస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ , మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

క్షమాపణ చెప్పకపోతే తీవ్రపరిమణాలు తప్పవని, డా కుమారి గారు హెచ్చరించారు

ముఖ్యమంత్రి చంద్రబాబుని వ్యక్తిగతంగా విమర్శించిన అంబటి రాంబాబుని ఎవరూ ఒక మనిషిలా చూడటం లేదని కుమారి ,ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి వ్యాఖ్యల నేపథ్యంలో మాట్లాడుతూ సభ్యత, సంస్కారం అన్నవి ఏ కోశానా రాంబాబుకు లేనట్టు కనిపిస్తున్నాయన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజంగా ఉంటాయన్నారు. గతంలో కూడా వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, కూటమి నాయకులను ఇష్టానుసారం దూషించారన్నారు. ఆరోజే జగన్ వీటిని ఖండించి ఉంటే.. రాంబాబు లాంటి వారు ఇంత బరితెగించి మాట్లాడి ఉండే వారు కాదన్నారు. ఆయన వ్యాఖ్యలు కనీసం కుటుంబసభ్యులైనా హర్షిస్తారా అని నిలదీశారు. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని.. లేదంటే రాష్ట్రంలో తెలుగు మహిళలు ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.
ఇంకా మీ బూతు భజన. ఆపాలని,జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి.. తన సంస్కారాన్ని కాపాడుకోవాలని ఏపీ స్టేట్ యస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డా పూరిమిట్ల కుమారి సూచించారు.

WhatsApp Join Now
Youtube Subscribe