అంబటి రాంబాబు పేరు పలకడానికి కూడా సిగ్గేస్తోంది: కన్నా లక్ష్మీనారాయణ

వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యలు అత్యంత దిగజారుడువని తెదేపా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా విమర్శించారు. ఆయన పేరు పలకడానికే సిగ్గేస్తోందన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పాలన దాడులు, దౌర్జన్యాలతో నడిచిందని ఆరోపించారు. వైసీపీ నేతలు బూతులు, బెదిరింపులతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబులాంటి రాజకీయ చరిత్ర ఎవరికీ లేదని, ఆయన రికార్డులను ఎవరూ చెరిపేయలేరని స్పష్టం చేశారు.

WhatsApp Join Now
Youtube Subscribe