పోలీసులు ఫిర్యాదు చేసిన టిడిపి నాయకులు
హిందూపురం,
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై బండబూతలతో విరుచుకుపడ్డ వైసిపి నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు పై రాజ ద్రోహం కేసు నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం హిందూపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సీఐ రాజగోపాల్ నాయుడుకు తెలుగుదేశం పార్టీ నాయకులు అంబటి పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టిడిపి లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు శివ శంకర్ మాట్లాడుతూ సీఎంపై అంబటి వ్యాఖ్యలు అత్యంత నీచమని సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడడం దారుణం అన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా మరిచిపోయి అలాంటి బూతులు తిట్టడం హేయమైన చర్య అన్నారు. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా వీధి రౌడీల వ్యవహరించారని విరుచుకుపడ్డారు. కల్తీ నెయ్యి పై డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని దానిని సమర్ధించుకునేందుకు వైసిపి నాయకులు తికమకపడి చంద్రబాబుపై పదజాలంతో మాట్లాడటం సభ్య సమాజం చీదరించుకుంటుందన్నారు . ఇలాగే ఉంటే సంస్కారహీనులుగా మిగిలిపోవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో అశాంతి రేపేందుకు వైసిపి పక్క ప్లాను
