అందరూ చాకచక్యంగా పట్టేశాడనుకున్నారు… కట్ చేస్తే షాక్ ఘటన!

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహానంది ఆలయం వద్ద స్నేక్‌క్యాచర్‌కు అనూహ్య ప్రమాదం జరిగింది. ఆలయ పరిసరాల్లో కనిపించిన నాగుపామును పట్టుకునే క్రమంలో ప్రసిద్ధ స్నేక్‌క్యాచర్ మోహన్‌ను అదే పాము కాటేసింది. వెంటనే అప్రమత్తమైన మోహన్ అక్కడే ప్రథమ చికిత్స పొందారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఎన్నో ప్రమాదకర పాములను సురక్షితంగా పట్టుకున్న మోహన్‌కే ఈ ప్రమాదం జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

WhatsApp Join Now
Youtube Subscribe