అంగరంగ వైభవంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు సంబరాలు..

బనగానపల్లె,ఫిబ్రవరి,18
ఎల్లో సింగం ప్రతినిధి,

బనగానపల్లె మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని యాగంటి దేవస్థానం సమీపంలో దాదాపు పది సంవత్సరాల తర్వాత రైతు సంబరాల కార్యక్రమం లో భాగంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలు జాతి వృషభరాజముల అంతర్రాష్ట్ర బల ప్రదర్శన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అవుకు మండలం టిడిపి అధ్యక్షులు ఉగ్రసేనారెడ్డి,బనగానపల్లె మార్కెట్ యార్డ్ చైర్మన్ కాట్రేడ్డి మల్లికార్జున రెడ్డి,టీడీపీ నాయకులు కాటసాని చంద్రశేఖర్ రెడ్డి లు పాల్గొని ఎద్దుల పోటీలను ప్రారంభించారు.ఎద్దుల పోటీలను వీక్షించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు.ఈ పోటీలలో మొదటి బహుమతి ఉగ్రసేనారెడ్డి 70,000,రెండవ బహుమతి అన్నదాత మురళి 55,000,మూడవ బహుమతి ప్రముఖ పారిశ్రామికవేత్త దొనపాటి యాగంటి రెడ్డి 40,000,నాల్గవ బహుమతి పాతపాడు సర్పంచ్ మహేశ్వర రెడ్డి 30,000,ఐదవ బహుమతి కాపుల పల్లె సర్పంచ్ తులసి రెడ్డి 20,000, ఆరవ బహుమతి లక్ష్మిరెడ్డి 15,000, ఏడవ బహుమతి గోపాల్ రెడ్డి 10,000, ఎనిమిదవ బహుమతి యామసాని నాగిరెడ్డి 8000 రూపాయలు అందజేయనున్నారు.ఈ కార్యక్రమం లో రామిరెడ్డి గారి అమర్నాథ్ రెడ్డి,సంగు శంకశ్వర రెడ్డి,బత్తుల నారాయణ రెడ్డి,మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ భూషన్న,పాతపాడు సర్పంచ్ మహేశ్వర రెడ్డి,ప్రసన్న కుమార్ రెడ్డి,సంగు శ్రీనివాస్ రెడ్డి,మెట్టుపల్లె సర్పంచ్ యడమకంటి తులసి రెడ్డి,లక్ష్మి కాంతు రెడ్డి,పాలకమండలి సభ్యులు రామశేఖర్,సంతోష్ కుమార్ రెడ్డి,బండి కుమార్ స్వామి రెడ్డి,బండి హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe