అంగన్వాడీల హాజరులో మన్యం జిల్లా సరికొత్త రికార్డు

  • 99 శాతంతో దేశానికే ఆదర్శం
  • జిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్డి

పార్వతీపురం జిల్లా ప్రతినిధి జనవరి 30(ఎల్లో సింగం)

​విద్యా, వైద్య మరియు శిశు సంక్షేమ రంగాల్లో మన్యం జిల్లా అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ రాష్ట్ర మరియు దేశస్థాయిలో అగ్రగామిగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్డి అన్నారు.ఒరిస్సా సరిహద్దులోని మారుమూల కుశ గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సంపూర్ణ అభియాన్ 2.0 ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్డి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి, కురుపాం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ తోయిక జగదీశ్వరి, జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ తో కలసి పాల్గొన్నారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ​అంగన్వాడీ కేంద్రాల్లో విప్లవాత్మక మార్పులు ​గతంలో అంగన్వాడీ కేంద్రాలంటే కేవలం భోజనం పెట్టే కేంద్రాలుగా ఉండేవని, కానీ నేడు అవి పిల్లల ఆహ్లాదకరమైన ఆటస్థలాలుగా మారాయన్నారు. ప్రభుత్వ చొరవతో కేంద్రాల్లో టీవీలు, ఆటవస్తువులు అందుబాటులోకి రావడంతో పిల్లలు స్వచ్ఛందంగా కేంద్రాలకు తరలివస్తున్నారు. దీని ఫలితంగా మన్యం జిల్లాలో అంగన్వాడీ హాజరు 99 శాతం నమోదైందని, ఇది రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానం అని వెల్లడించారు.మన్యం జిల్లా వంటి ఏజెన్సీ ప్రాంతం రాష్ట్రస్థాయి పదో తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలవడం జిల్లా అధికారుల, ఉపాధ్యాయుల కృషికి నిదర్శనమని కొనియాడారు. పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. ఆరోగ్య మౌలిక సదుపాయాల్లో గతంలో 104వ స్థానంలో ఉన్న మనం, నేడు 13వ స్థానానికి చేరుకున్నామని, త్వరలోనే నంబర్ వన్ స్థానాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.దేశవ్యాప్తంగా 106 జిల్లాల్లో ప్రారంభం కావాల్సిన ఈ నూతన కార్యక్రమాన్ని, అందరికంటే ముందుగా మన్యం జిల్లాలోనే ప్రారంభించడం విశేషం. మిగిలిన జిల్లాలు రెండో తేదీన ప్రారంభించనుండగా, మంత్రివర్యుల చొరవతో మన్యం జిల్లాలో ముందుగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.హెల్త్, ఎడ్యుకేషన్ రంగాల్లో ప్రభుత్వం నిర్దేశించిన కొత్త లక్ష్యాలను చేరుకునేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని, జిల్లాను దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలబెడతామని ఈ సందర్భంగా మంత్రి గారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe