సాంకేతిక నైపుణ్యాలతో యువ వ్యాపారవేత్తలుగా ఎదగాలి: ప్రిన్సిపల్ ఎల్‌బీ ప్రదీప్ కుమార్

ఎల్లోసింగం, కుప్పం: సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా విద్యార్థులు యువ వ్యాపారవేత్తలుగా ఎదగవచ్చని కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎల్‌బీ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కళాశాల ఆవరణలో “స్టార్ట్‌అప్ ఎకో సిస్టం అండ్ డిజిటల్ స్కిల్స్ ఫర్ ఎంపవరింగ్ రూరల్ యూత్” అనే అంశంపై పీఎం ఉష, బ్లాక్ బక్స్ ఎడ్యుకేషన్ లిమిటెడ్ వారి సహకారంతో జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించుకొని స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని, ఆధునిక సాంకేతికతను వినియోగించి సొంత వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చని సూచించారు. గ్రామీణ యువతకు స్టార్ట్‌అప్ సంస్కృతి గొప్ప అవకాశాలను అందిస్తుందని అన్నారు. సెమినార్ కన్వీనర్ వి. నారాయణమూర్తి మాట్లాడుతూ, విభిన్నంగా ఆలోచించడం ద్వారా గ్రామీణ యువత కూడా వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని తెలిపారు. రిసోర్స్ పర్సన్స్ జ్ఞాన్ యాన్, పూజితలు సదస్సు ప్రాధాన్యతను వివరిస్తూ డిజిటల్ స్కిల్స్, స్టార్ట్‌అప్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ సి. రాజ్యలక్ష్మి, డాక్టర్ కె. మాధవి, నమ్రత, డాక్టర్ చంద్రబాబు, కామర్స్ విభాగ అధ్యాపకులు, వివిధ కళాశాలల నుంచి వచ్చిన పత్ర సమర్పకులు, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe