ఉయ్యూరు, ఫిబ్రవరి 02 (ఎల్లో సింగం ప్రతినిధి) : ఉయ్యూరు మండలం, చిన్న ఓగిరాల ప్రధానసెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభు ఇంటీరియర్ గృహోపకరణాల కార్యాలయం ప్రారంభోత్సవానికి నిర్వాహకుల ఆహ్వానం మేరకు విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్, AMC చైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ…, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో యువ నాయకుడు లోకేష్ బాబు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామికంగా, సాంకేతికంగా అభివృద్ధి పరుగులు పెడుతున్నాయనీ, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, నిర్మాణ రంగంలో అభివృద్ధికి, అమరావతిలో నిర్మాణాలు ఊతమిస్తున్నాయనీ, ప్రభు ఇంటీరియర్ నూతనంగా ప్రారంభిస్తున్న రామకృష్ణకు వ్యాపారంలో మంచి అవకాశాలు ఉన్నాయని ఆర్థికంగా పైకి రావాలని ఆకాంక్షించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న ఓగిరాల తెదేపా అధ్యక్షులు ఓగిరాల నాగభూషణం, పాలడుగు శంకరయ్య, తదితర కూటమి నేతలు పాల్గొన్నారు
వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకోవడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి : మాజీ ఎమ్మెల్సీ వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్
02
Feb
WhatsApp
Join Now
Youtube
Subscribe
