- కనుమ పండుగ సందర్భంగా ప్రత్యేక విందు కార్యక్రమం
- చిట్వేలి మండలం నాగవరంలోని స్వగృహంలో నిర్వహణ
చిట్వేలి, జనవరి 15: ఎల్లో సింగం ప్రతినిధి
సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగ అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మీడియా మిత్రులందరితో పండుగ సంతోషాన్ని పంచుకోవడానికి ఆయన ప్రత్యేకంగా ‘ఆత్మీయ విందు’ఏర్పాటు చేశారు.
తేదీ: 16-01-2026 (శుక్రవారం – కనుమ పండుగ) మధ్యాహ్నం 12:00 గంటలకు పంతగాని నరసింహ ప్రసాద్ స్వగృహం, నాగవరం గ్రామం, చిట్వేలి మండలం.
నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పత్రికా మరియు టీవీ రంగ మీడియా మిత్రులందరూ ఈ ఆత్మీయ విందు కార్యక్రమానికి తప్పక హాజరుకావాలని ఆయన మనస్ఫూర్తిగా కోరారు. సమాజ హితం కోసం నిరంతరం శ్రమించే జర్నలిస్టు సోదరులతో ఈ పండుగ సమయాన్ని గడపడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
