ప్రాణం పోసిన రక్తం – అరుదైన B-నెగటివ్‌తో పది మందికి ప్రాణదానం చేసిన బాలసుబ్రహ్మణ్యం

కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన బాలసుబ్రహ్మణ్యం మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. మచిలీపట్నంలోని సాయి శ్రీరామ్ హాస్పిటల్‌లో అత్యవసర పరిస్థితిలో ఉన్న ఒక మహిళకు అరుదైన B-నెగటివ్ రక్తం అత్యవసరంగా అవసరమైన వేళ, కుటుంబ సభ్యులు ఎంతగానో ఆందోళన చెందారు. ఈ క్లిష్ట సమయంలో “మన అవనిగడ్డ బ్లడ్ డోనార్స్” ద్వారా వచ్చిన పిలుపునకు బాలసుబ్రహ్మణ్యం వెంటనే స్పందించారు.

చల్లపల్లిలో “బాలు సెల్ పాయింట్” నిర్వహణలో బిజీగా ఉన్నప్పటికీ, ప్రాణం విలువను అర్థం చేసుకున్న ఆయన ఎండను సైతం లెక్కచేయకుండా హాస్పిటల్‌కు చేరుకుని రక్తదానం చేశారు. విశేషమేమిటంటే, ఇది ఆయన చేసిన 10వ రక్తదానం. ప్రతి సారి నిశ్శబ్దంగా, ప్రతిఫలం ఆశించకుండా సేవచేస్తూ ప్రాణదాతగా నిలుస్తున్నారు.

రక్తదానం పట్ల సమాజంలో ఇంకా ఉన్న అపోహలను తొలగిస్తూ, ముఖ్యంగా నెగటివ్ బ్లడ్ గ్రూపులు కలిగినవారికి ఆయన స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఒకరి రక్తం మరొకరి జీవితంలో వెలుగులు నింపగలదని ఆయన చర్య మరోసారి చాటిచెప్పింది. బాలసుబ్రహ్మణ్యం గారి నిస్వార్థ సేవకు స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. రక్తదానం చేయండి – ప్రాణాలను కాపాడండి.

WhatsApp Join Now
Youtube Subscribe