నందిగామ ఎల్లో సింగం రిపోర్టార్
పేదలకు కార్పొరేట్ వైద్య సేవల లక్ష్యంతో సీఎం సహాయనిధి చెక్కులు అందజేసిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ..
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రత్యక్ష నిదర్శనంగా మంగళవారం నాడు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.నియోజకవర్గంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు తన సిఫార్సు లేఖల ద్వారా సీఎం సహాయనిధికి పంపించిన మెడికల్ బిల్లుల ఆధారంగా 102 మంది లబ్ధిదారులకు అక్షరాలా ₹34,26,529 రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థాన బోర్డు డైరెక్టర్ తంబళ్లపల్లి రమాదేవి గారు, భారతీయ జనతా పార్టీ ఓబీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ తొర్లికొండ సీతారామయ్య , కూటమి నేతలతో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నేరుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా గుర్తించి, వారికి అవసరమైన సహాయాన్ని వేగంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ సహకారానికి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు , ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
చెక్కులు అందుకున్న లబ్ధిదారులు హర్షధ్వానాల మధ్య కూటమి ప్రభుత్వానికి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యత అనే విషయం మరోసారి ఈ కార్యక్రమం ద్వారా రుజువైంది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల రాష్ట్ర ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, మండల/పట్టణ పార్టీ తెదేపా అధ్యక్షులు, గ్రామ/వార్డు తెదేపా అధ్యక్షులు, వార్డు కౌన్సిలర్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్లు, వివిధ హోదాల రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు, కూటమిన్ నేతలు లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
