నంద్యాల అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి కార్యకర్తలు పునరంకితం కావాలి: రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్

​నంద్యాల, ఫిబ్రవరి 02,
( ఎల్లో సింగం ప్రతినిధి )

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే పార్టీకి అసలైన బలం మరియు ప్రాణవాయువు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు పేర్కొన్నారు. సోమవారం నాడు నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

​ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ గారు మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటే ఉండి నడిపించిన కార్యకర్తలకు ఎల్లప్పుడూ సముచిత స్థానం ఉంటుందని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. నంద్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని, ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

WhatsApp Join Now
Youtube Subscribe