నందలూరులో ఘనంగా డాక్టర్ అరిగె సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం వక్తృత్వ పోటీలు

​నందలూరు, జనవరి 30,(ఎల్లో సింగం ప్రతినిధి)

నందలూరులోని స్వర్ణాంధ్ర మదర్ ల్యాండ్ విక్టరీ స్కౌట్ గ్రూప్ ఆధ్వర్యంలో, రాజంపేట ఏఐటీఎస్ డీన్ దివంగత డాక్టర్ అరిగె సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం రాజంపేట పార్లమెంట్ స్థాయి వక్తృత్వ పోటీలు నిర్వహించబడ్డాయి. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు నందలూరులోని అరవపల్లి, గురజాడ నగర్ నందున్న విస్డమ్ హైస్కూల్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది.
​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరియు గౌరవ అతిథులుగా పలువురు ప్రముఖులు విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
​కార్యక్రమ విశేషాలు:
​విద్యా రంగంలో విద్యార్థుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ పోటీల్లో రాజంపేట పార్లమెంట్ పరిధిలోని వివిధ హైస్కూళ్ల విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
​పాల్గొన్న ప్రముఖులు:
​యన్. శ్రీనివాసులు: ప్రధానోపాధ్యాయులు, జడ్పీహెచ్ స్కూల్, నందలూరు.
​లయన్ డాక్టర్ కూర మణి యాదవ్: అధ్యక్షులు – మానవతా సేవా సంస్థ, వ్యవస్థాపకులు – లయన్స్ క్లబ్, నందలూరు.
​సమ్మెట ఉమామహేష్: డైరెక్టర్, శ్రీ అన్నమాచార్య హైస్కూల్, నాగిరెడ్డిపల్లి.
​డాక్టర్ మీసరా గండ నాగేంద్ర ప్రసాద్: రిటైర్డ్ ఇంగ్లీష్ టీచర్.
​కె. సంపత్ పవన్ కుమార్: ఇంగ్లీష్ టీచర్, జడ్పీ హైస్కూల్, నాగిరెడ్డిపల్లి.
​లయన్ గందం గంగాధర్: వార్డు మెంబర్, నాగిరెడ్డిపల్లి.
​పి. మహేష్: జిల్లా కార్యదర్శి, సిపిఐ, నందలూరు.
​పి. శ్రీనివాసులు, కె. సురేంద్ర (పి.ఇ.టి లు) మరియు టాటా మోటర్స్ మేనేజర్ యమ్. హర్ష, ఎదురైడ్స్ హైస్కూల్ ప్రతినిధి యమ్. అభిషిక్.
​నిర్వహణ:
ఈ కార్యక్రమాన్ని విక్టరీ వేపగుంట సాంరాజ్ (క్రీడా, విద్య మరియు సాంస్కృతిక మేనేజర్) సమక్షంలో స్కౌట్ గ్రూప్ సభ్యులు నరసింహ సాయి, రూపేష్, జయ కుమార్, రెడ్డి శేఖర్ బాబు, యమ్. జస్వంత్ మరియు మునగు స్కౌట్ సభ్యులు పర్యవేక్షించారు.
​ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. డాక్టర్ అరిగె సుబ్రహ్మణ్యం గారు విద్యా రంగానికి చేసిన సేవలను కొనియాడారు. విద్యార్థులు ఇటువంటి పోటీల ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

WhatsApp Join Now
Youtube Subscribe