–ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
దొర్నిపాడు, ఫిబ్రవరి,4.
( ఎల్లో సింగం ప్రతినిధి )
దొర్నిపాడు సమీపం లోని కే.సి.కెనాల్ 24 వ లాక్ ను బుధవారం ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని కేసీ కెనాల్ ఆయకట్టు రైతులకు చివరి ఆయకట్టు వరకు నీటిని ఇస్తామని తెలిపారు.
వైసీపీ నాయకులు పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ వద్దకు వెళ్లి ఏం సాధిస్తారని ఎమ్మెల్యే అఖిలప్రియ ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వల్ల ఇప్పుడు వైసీపీ నేతలకు ప్రాజెక్టులు గుర్తుకు వచ్చాయా అంటూ ప్రశ్నించారు.
తమ ప్రభుత్వ హయాంలో ఏ రైతు నష్టపోయేది ఉండదని స్పష్టం చేశారు.
కాలువలలో నీరు పుష్కలంగా ఉందని కొన్ని కాలువల్లో ఏ రోజు నీటిని చూడని రైతులు కూడా ఈరోజు నీటిని చూస్తున్నారని ఎమ్మెల్యే అఖిలప్రియ స్పష్టం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు పై
అంబటి రాంబాబు చేసిన వికృత చేష్టలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్రంగా ఖండించారు.
ఇంత జరుగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిడిపి కార్యకర్తలను సంవవమనం పాటించాలని కోరడం ఆయన నీతి నిజాయితీలకు పరాకాష్ట అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వ్యాఖ్యానించారు.
