తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో వైకాపాకు ఎలాంటి క్లీన్‌చీట్ రాలేదని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. క్లీన్‌చీట్ అంటూ ఆ పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తెదేపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిబంధనలను వైకాపా సడలించి కల్తీకి బీజం వేసిందన్నారు. ఈ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు వదిలిపెట్టరని, బాధ్యులెవరో తేల్చే వరకు చర్యలు కొనసాగుతాయని తెలిపారు. 2022లోనే నెయ్యి కల్తీ నివేదిక ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
